అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయే క్షణాలు … పంతం నెగ్గించుకోనున్న కేంద్ర ప్రభుత్వం !

-

గత కొంతకాలంగా ఢిల్లీ పాలనాధికారాలపై ఎవరు అధికారాన్ని చెలాయించవచ్చు అన్న ప్రశ్నకు అటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరియు కేంద్ర ప్రభుత్వానికి మధ్యన మాటల వివాదాలు జరుగుతూ ఉన్నాయి. కోర్టులు మాత్రమే కేజ్రీవాల్ కు మద్దతుగా తీర్పు ఇచ్చినా.. విడిచి పెట్టని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న మాన్సూన్ పార్లమెంట్ సెషన్స్ లో ఈ బిల్లును ప్రవేశ పెట్టింది. కాగా ఈ బిల్లుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పార్టీ BJD కి చెందిన 9 మంది రాజ్యసభ ఎంపీలు మద్దతు తెలిపే ఛాన్సెస్ ఎక్కువ. దీనితో రాజ్యసభలో ఈ బిల్లు పాస్ అవుతుంది. ఇక లోక్ సభలో ఎలాగు ఎన్డీఏ కూటమికి సంపూర్ణ ఆధిపత్యం ఉంది. కాబట్టి రెండు సభలలోనూ ఈ బిల్లుకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఓట్లు ఉండడంతో ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లుపై తన పంతాన్ని నెగ్గించుకోనుంది. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంలో ఓడిపోనున్నారు.

ఇక కేజ్రీవాల్ కు మద్దతుగా ఉన్న బీజేపీ విపక్షాలు నిరాశ చెందుతాయని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news