దేశ వ్యాప్తంగా అమలు అవుతున్న లాక్ డౌన్ తో ఇప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. బయటకు వచ్చి కాయ కూరలు కొనే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ప్రజలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు నరకం చూస్తున్నారు అనేది వాస్తవం. దీనితో ప్రభుత్వాలు ప్రజల కష్టాలు తీర్చడానికి ముందుకి వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసి బస్సుల ద్వారా కూరగాయలు ఇవ్వాలని భావిస్తుంటే తమిళనాడులో ప్రజల ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకుని సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రజల సౌకర్యార్ధం ప్రతి ఇంటికి చేరే విధంగా రూ.100ల కాయగూరల ప్యాకేజ్ పంపిణీని మంత్రి ఎస్పీ వేలుమణి తాజాగా ప్రారంభించారు. కోయంబత్తూర్ మార్కెట్‌లో ప్రజల రద్దీ తగ్గించేందుకు గాను… ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.100లకే 12 రకాల కాయగూరల ప్యాకేజ్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ప్రజలకు మంత్రి ఎస్పీ వేలుమణి స్వయంగా పాల్గొని ఈ కూరగాయలను ప్రజలకు నేరుగా అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కోవై కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాల్లో వ్యాన్ల ద్వారా ఈ ప్యాకేజ్‌లను ప్రజల ఇళ్ల వద్దకు వస్తాయని… మరో ప్యాకేజ్ రూ.100కు విక్రయిస్తున్నట్లు మీడియాకు వివరించారు. ఇది గనుక విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం చూస్తుంది.