ఎన్నికల ముంగిట తమిళ రాజకీయాలు హీటెక్కాయి. ఈరోజు అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం జరగనుంది. సీఎం అభ్యర్థి ఎవరు అనేది చర్చించడానికే చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒక సమావేశం నిర్వహించనున్నాయి పార్టీ వర్గాలు. నిజానికి కొద్ది రోజుల క్రితం వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే దాని మీద పళని స్వామి, పన్నీర్ సెల్వం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మరో సారి తనకే అవకాశం కావాలని సీఎం కోరుతోండగా పన్నీర్ సెల్వం మాత్రం అందుకు ఏమాత్రం అంగీకరించడం లేదు. .
ఈసారి తానే సీఎం అభ్యర్థిగా ఉంటానని చెబుతున్నారు. ఇక ఈరోజు సీఎం అభ్యర్ధిపై ఉదయం 10 : 56 నిముషాలకు ప్రకటన వెలవడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే పళని స్వామికి 18 మంది మంత్రులు మద్దతుగా నిలవగా మిగతామంత్రులు , ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు బాసటగా నిలిచినట్టు సమాచారం. రాత్రి తేని నుంచి చెన్నై తిరిగొచ్చిన పన్నీర్ సెల్వం.. సీనియర్ నేతలు కేపీ మునుస్వామి, మనోజ్ పాండియన్‌తో చర్చలు జరిపారు. సిఎం నివాసంలో కూడా ఆయన మంత్రులు ఆర్బీ ఉదయకుమార్, కడంబూర్ రాజులతో చర్చలు జరిపినట్లు సమాచారం. చూడాలి ఈ ఈరోజుఏమి తేలుతుందనే అంశం.