జంగారెడ్డి గూడెం ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ఉన్న సెల్ టవర్ ని రోహిత్ అనే యువకుడు ఎక్కి కూర్చున్నాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. ఆరు నెలల నుండి ఒక యువతి తాను పరస్పరం ప్రేమించుకుంటున్నామని, అయితే ఆమె చేత తనను వేధిస్తున్నాడని పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించారని రోహిత్ ఆరోపిస్తున్నాడు. అయితే మొన్న రాత్రి యువతి ఫిర్యాదుతో విచారణకు వెళ్ళిన రాంబాబు అనే కానిస్టేబుల్ పై రోహిత్ దాడి చేశాడు.
దీంతో రోహిత్ పై మరో కేసు నమోదయింది. అయితే స్థానిక వైసీపీ నాయకుడి ప్రోద్బలంతోనే తన మీద తప్పుడు కేసు పెట్టారంటున్న రోహిత్ వర్షం వస్తున్నా రాత్రంతా టవర్ పైనే గడిపినట్టు తెలుస్తోంది. అయితే కిందకు దించేందుకు ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో వర్షంలో అక్కదే ఉండలేక రాత్రి తిరిగి వెళ్ళిపోయిన పోలీసులు, ఫైర్ సిబ్బంది మళ్ళీ ఉదయం అక్కడికి చేరుకున్నారు. తనను కేసులో ఇరికించిన వైసీపీ నాయకుడిపై కేసు పెట్టాలని అప్పటిదాకా కిందకి దిగిరానని రోహిత్ డిమాండ్ చేస్తున్నాడు.