సినీ సెలబ్రిటీలకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన తారక్.. మెగా హీరో లేకుండానే..!!

-

తారక్ తన నివాసంలో తాజాగా కొంతమంది సెలబ్రిటీలకు విందు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్ర ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన తారక్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తన సన్నిహితులు, స్నేహితులకు విందు ఇచ్చారు. అమెజాన్ స్టూడియోస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ కోసం తన నివాసంలో ఈ డిన్నర్ పార్టీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ డిన్నర్ పార్టీకి ఆర్ ఆర్ ఆర్ దర్శకుడు రాజమౌళితోపాటు చిత్ర నిర్మాతలు మైత్రి మూవీస్ నరేష్ , శిరీష్ రెడ్డి తో పాటు బాహుబలి ప్రొడ్యూసర్స్ ప్రసాద్ దేవినేని , శోభు యార్లగడ్డ పాల్గొన్నారు. వీరితో పాటు తాను నెక్స్ట్ చేయబోయే సినిమా డైరెక్టర్ కొరటాల శివ కూడా హాజరయ్యారు.

తాజాగా తారక్ ఇచ్చిన ఈ డిన్నర్ పార్టీ ఫోటోలను తారక్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరితో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇదే సమయంలో తారక్ ఇలా ఉన్నట్టుండి పార్టీ ఇవ్వడం వెనుక అసలు కారణం ఏమిటి అనే వార్తలు మరింత వైరల్ గా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో జేమ్స్ ఫారెల్ తో పాటు సినీ పరిశ్రమకు చెందిన అతి కొద్ది మంది మాత్రమే ఈ పార్టీలో పాలుపంచుకోవడం ఆసక్తికరంగా మారింది.

అంతేకాదు తారక్ ఈ ఫోటోలను షేర్ చేస్తూ జేమ్స్, ఎమిలీలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ మాట నిలబెట్టుకున్నందుకు మరియు విందు కోసం మాతో చేరినందుకు ధన్యవాదాలు అంటూ కామెంట్ చేశాడు. రామ్ చరణ్ మాత్రం ఈ పార్టీలో హాజరు కాలేదు.. ఆయన మాల్దీవ్స్ లో ఉండడం వల్ల పార్టీకి హాజరు కాలేదని సమాచారం. ఇకపోతే తన 30వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఈయన ఇందులో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news