మొదటిసారి ఎమోషనల్ పోస్ట్ చేసిన తారకరత్న భార్య..!

-

నందమూరి హీరో తారకరత్న ఇటీవల కన్నుమూయడం వారి కుటుంబాన్ని ఒక్కసారిగా ఒంటరిని చేసేసింది. ముఖ్యంగా ఆయన భార్యా పిల్లలు తారకరత్నను కోల్పోవడం చూసే వారికంట కన్నీరు తెప్పిస్తుంది . ఇదిలా ఉండగా తారకరత్నకు సంబంధించిన ప్రతి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొదటిసారి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి తారకరత్న పుట్టినరోజు సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేయడం ఇప్పుడు మరింత మందిని కలచి వేస్తోందని చెప్పవచ్చు.

తాజాగా ఆమె ఒక ప్రత్యేకమైన రోజును గుర్తు చేసుకుంటూ తన భర్తకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఫిబ్రవరి 22వ తేదీన తారకరత్న పుట్టినరోజు కావడంతో ఈ విషయం వారిని మరింత మనోవేదనకు గురిచేస్తోంది. ప్రతి పుట్టినరోజు కుటుంబ సభ్యులతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న తారకరత్న ఇప్పుడు వారి మధ్య లేకపోవడంతో తట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో కూడా అలేఖ్య రెడ్డి మొదటిసారి తన భర్తకు సంబంధించిన ఫోటోని పోస్ట్ చేస్తూ తన ప్రేమను షేర్ చేసుకుంది.

హ్యాపీ బర్తడే బెస్ట్ ఫాదర్ .. బెస్ట్ హస్బెండ్.. అలాగే ఒక మంచి మానవత్వం ఉన్న వ్యక్తి.. నిన్ను చాలా మిస్ అవుతున్నాను.. లవ్ యు సో మచ్ అంటూ అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో చాలా ఎమోషనల్ గా తన భర్త పై ఉన్న ప్రేమను వివరిస్తూ చెప్పింది. అంతేకాకుండా తన కూతురితో ఉన్న ఫోటోలు కూడా ఆమె అందులో షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede)

Read more RELATED
Recommended to you

Latest news