బిజెపితో టిడిపి పొత్తు… తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణ లో బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకోవడం పై బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.  టిడిపితో పొత్తు పెట్టుకోనున్నట్లు వస్తున్న వార్తలను బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ కొట్టి పారేశారు. తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.

పొత్తులపై తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు. ఉనికిని కోల్పోయిన కొన్ని పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని అన్నారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఓడించే బలం బిజెపికి ఉందని ఓ ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అత్యంత దారుణంగా పరిపాలిస్తుందని మండిపడ్డారు తరుణ్ ఛుగ్. కెసిఆర్ సర్కారుకు ప్రత్యామ్నాయంగా… బిజెపి ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news