పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగాయని, 6.09 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రూ.39.04 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.
ఈనెల 28న రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు మొదలుపెట్టినట్లు చెప్పారు. త్వరలో తెలంగాణ కరీంనగర్ లో 10 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయ నిర్మాణం ప్రారంభిస్తామని వెల్లడించారు.
శ్రీవారి ఆలయంలో వున్న పరిస్థితులు దృష్యా రోజుకి 70 వేల మంది భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించవచ్చన్నారు. గత ఏడాది 2.37 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే…హుండి ద్వారా 1450 కోట్ల ఆదాయం లభిస్తే…11.54 కోట్ల లడ్డు ప్రసాదాలు విక్రయిస్తే….4.77 కోట్ల మంది భక్తులుకు అన్నప్రసాద సౌకర్యం కల్పిస్తే…1.09 కోట్ల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని తెలిపారు. 28వ తేదిన రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తూన్నామన్నారు.