టాటా 500 కోట్ల భారీ విరాళం…!

-

కరోనా వైరస్ ని భారత ప్రభుత్వం ఎదుర్కోవడానికి గానూ కేంద్ర ప్రభుత్వానికి టాటా ట్రస్ట్ 500 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. కరోనాపై పోరాటంలో తాము సైతం కేంద్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పింది. టాటా ట్రస్ట్‌, టాటా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ తరపున రూ.500కోట్లను ఖర్చు చేయనున్నట్లు రతన్‌ టాటా ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

కొవిడ్‌-19 విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మేము కూడా సిద్ధమే. దేశ అవసరాల కోసం టాటా గ్రూప్‌ ఆఫ్‌ కంనీస్‌, టాటా ట్రస్ట్‌ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు కూడా” అని ఆయన ట్వీట్ చేసారు. రూ.500 కోట్లను దేని కోసం ఖర్చు పెట్టనున్నారనేది కూడా ఆయన ట్వీట్ లో వివరించారు. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, పెరుగుతున్న కరోనా కేసులకు అవసరమైన శ్వాస సంబంధిత పరికరాలు,

కరోనా నిర్ధారణ కిట్స్‌, కరోనా బాధితులకు చికిత్స అందించే సౌకర్యాలు మెరుగు పరచడానికి, హెల్త్‌ వర్కర్లు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలను ఈ మొత్తాన్ని వినియోగిస్తామని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కరోనాపై పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు పలువురు ప్రముఖులు, అనేక సంస్థలు ముందుకు వస్తున్నారు. హీరోలు రాజకీయ ప్రముఖులు అందరూ ముందుకి వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news