టాటా మోటార్స్ అదిరిపోయే పండ‌గ ఆఫ‌ర్లు.. 1.5 లక్షల భారీ డిస్కౌంట్‌

దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తాజాగా అదిరిపోయే పండగ ఆఫర్లు ప్రకటించింది. తన కార్లపై ఏకంగా రూ. 1.5 లక్షల భారీ త‌గ్గింపు అందిస్తోంది. నెక్సన్, హెక్జా, టియాగో, టియాగో ఎన్‌ఆర్‌జీ, టిగోర్‌, హారియ‌ర్‌ వంటి మోడళ్లకు తగ్గింపు వర్తిస్తుంది. టాటా మోటార్స్ ఫెస్టివల్ ఆఫ్ కార్స్ స్కీమ్‌లో భాగంగా ఈ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. కంపెనీ అలాగే కొత్త కస్టమర్లకు క్యాష్‌ బెనిఫిట్స్ కూడా ఆఫర్లు చేస్తోంది. పాత కార్లు ఇచ్చి ఎక్స్చేంజ్ రూపంలో కొత్త కార్లు కొనుగోలు చేసే వారికి కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

టాటా మోటార్స్ డిస్కౌంట్ ఆఫర్లు గమనిస్తే.. టాటా హెక్జా మోడట్‌పై రూ. 1.5 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. టాటా నెక్సన్ కారుపై రూ. 85,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. టాటా టియాగో మోడల్‌పై రూ. 70,000 ప్రయోజనం పొందవచ్చు. టాటా టియాగో ఎన్ఆర్‌జీ కారుపై రూ. 65,000 వరకు డిస్కౌంట్ ఉంది. టాటా టిగోర్ మోడల్‌పై రూ. 1.15 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.

కంపెనీ అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు, కార్పొరేట్స్‌ కోసం ప్రత్యేకమైన స్కీమ్‌ను కూడా లాంచ్ చేసింది. కస్టమర్లకు ఆర్థిక మద్దతు అందించేందుకు కంపెనీ వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో మోడల్ ఆన్‌రోడ్ ధ‌ర‌కు సమానంగా 100 శాతం లోన్ పొందొచ్చు. అలాగే కొనుగోలుదారులకు తక్కువ ఈఎంఐ ఆప్ష‌న్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాహన అమ్మకాలు భారీగా ప‌డిపోతున్న నేపథ్యంలో కంపెనీ ఆఫర్లు ప్రకటించడం గమనార్హం.

టాటా మోటార్స్ డిస్కౌంట్ ఆఫర్లు

– Hexa – Rs 1,50,000
– Nexon – Rs 85,000
– Tiago – Rs 70,000
– Tiago NRG – Rs 70,000
– Tigor – Rs 1,15,000
– Harrier – Rs 50,000