నేడు, రేపు టీడీపీ వరుస మీటింగ్స్…దాని మీదనే ఫోకస్ ?

కొత్త ఏడాది గేర్ మార్చేందుకు ప్రతిపక్ష టీడీపీ సిద్ధం అవుతుంది. కోవిడ్ కారణం గా ఏడాదిగా పార్టీ కార్యక్రమాల విషయం లో ఆచితూచి వ్యవహరించిన టీడీపీ..ఇప్పుడు దూకుడు పెంచుతాం అంటుంది. ఇప్పటి వరకు ఇంటికే పరిమితం ఆయన చంద్రబాబు కూడా రోడ్డెక్కుతున్నారు. మరో వైపు లోకేష్ వరుస పర్యటనలు నచేస్తున్నారు. ఇదే సమయం లో పార్టీ కమిటీల ను యాక్టివ్ట్ చేసేందుకు మీటింగ్స్ పెడుతుంది పార్టీ అధిష్టానం.

ఈ ఉదయం మంగళగిరిలో పొలిటీబ్యూరో మీటింగ్ జరుగనుంది. కొత్త పొలిటీబ్యూరో ఏర్పాటు తరువాత జరుగుతున్న తొలి సమావేశం కావడం తో ఆయా అంశాలపై లోతుగా చర్చించనున్నారు. తిరుపతి ఉప ఎన్నికలు, అమరావతి ఉద్యమానికి జాతీయ పార్టీల మద్దతు, నియోజకవర్గాల ఇంచార్జి ల నియామకం, ప్రభుత్వ వైఫల్యాలు – పార్టీ ప్రాణాళికలపై చర్చించ నున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం లో ఈ సమావేశం జరగనుంది. తిరుపతి ఉప ఎన్నిక ప్రతిష్టతకం గా మారడం.తో…దానిపై వ్యూహ రచన సిద్ధం చేయనున్నారు.