గుడివాడలో పేకాట శిబిరాల మీద దాడి..మూడు కోట్ల పైగా నగదు స్వాధీనం ?

Join Our COmmunity

గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం తమిరిస, దొండపాడు గ్రామాల మధ్య నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై  అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ బృందాల  దాడులు చేసినట్టు సమాచారం. సుమారు మూడు కోట్ల పైగా నగదు, పెద్ద సంఖ్యలో కార్లు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం అయినట్టు చెబుతున్నారు. పేకాట శిబిరాల వద్దకు మీడియాను వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్న నిర్వాహకులు, తమిరిశ గ్రామం నుండి మూడున్నర కిలోమీటర్ల లోపల చెరువులపై పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.

మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరులు పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. చెరువు గట్లపై నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై జరిగిన దాడుల్లో 42 లక్షల నగదు, 28 కార్లు, 13 మోటార్ సైకిళ్లు, స్వాధీనం చేసుకొని 30 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. వైసిపి నాయకులు దొండపాడు మురళి ఆధ్వర్యంలో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు.

TOP STORIES

ఫౌ-జి గేమ్‌కు భారీ స్పంద‌న‌.. తొలి రోజు ఎంత మంది డౌన్‌లోడ్ చేసుకున్నారంటే..?

ఎన్‌కోర్ గేమ్స్ డెవ‌ల‌ప్ చేసిన ఫియ‌ర్‌లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ (ఫౌ-జి) గేమ్ గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం గేమింగ్ ప్రియుల‌కు అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం...
manalokam telugu latest news