బాబుతో ఆడుకుంటున్న తమ్ముళ్ళు…!

-

నెక్స్ట్ టీడీపీని అధికారంలోకి తీసుకురావడం చంద్రబాబు ముందున్న అతి పెద్ద కర్తవ్యం…అందుకే ఈ వయసులో కూడా ఆయన ఇంత కష్టపడుతున్నారు..నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు…ప్రజల్లో తిరుగుతున్నారు..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అలాగే రాజకీయంగా వైసీపీ వల్ల ఇబ్బందులు ఎదురుకుంటున్న వారికి అండగా నిలుస్తున్నారు. అనేక మంది నేతలు, కార్యకర్తలు జైలుకు వెళ్ళిన, కేసులు పెట్టిన వెనక్కి తగ్గకుండా, వారికి ధైర్యం చెబుతూ బాబు ముందుకెళుతున్నారు.

బాబు ఇంత కష్టపడటానికి కారణం ఒక్కటే నెక్స్ట్ అధికారంలోకి రావడం…నెక్స్ట్ కూడా అధికారంలోకి రాకపోతే ఏం జరుగుతుందో బాబుకు తెలుసు…టీడీపీ రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. అందుకే జగన్ ని ఓడించడానికి బాబు తెగ కష్టపడుతున్నారు. అయితే బాబు కష్టానికి తొడయ్యి…టీడీపీ నేతలు ఇంకా దూకుడుగా పనిచేస్తే….వైసీపీని ఎదురుకోవచ్చు. కానీ టీడీపీలో కొందరు మాత్రమే బాబుకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. వారు పార్టీ కోసం కష్టపడుతున్నారు.

కొందరు మాత్రం ఇంకా లైన్ లో పడటం లేదు. ఏదో జిల్లా టూర్లకు వచిన్నప్పుడు బాబు వెనుక తిరిగి కొందరు టీడీపీ నేతలు హడావిడి చేస్తున్నారు..అలాగే మీడియాలో కనిపిస్తే చాలు…ఇంకా పని చేస్తున్నట్లే అని చూపిస్తున్నారు. అసలు బాబు ఉన్న రెండు రోజులే హడావిడిగా పనిచేస్తున్నారు. బాబు వెళ్ళగానే ఎవరు పనిలో వారు ఉంటున్నారు. పూర్తి స్థాయిలో వారి వారి నియోజకవర్గాల్లో తిరుగుతూ…పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే కార్యక్రమాలు, ప్రజా సమస్యలు తెలుసుకోవడం లాంటివి చేయడం లేదు.

ఏదో పార్టీ ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే…టీడీపీ నేతలని ముందుగానే పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు..అయితే కొందరు నేతలు ముందుగానే హౌస్ అరెస్ట్ లు అయిపోయి…సోషల్ మీడియా, మీడియాలో హడావిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల పార్టీకి పావలా ప్రయోజనం ఉండేలా లేదని సొంత కార్యకర్తలే మాట్లాడుకునే పరిస్తితి ఉంది. అలాంటి వారు బాబుతో తెలివిగా ఆడుకుంటున్నారని, అలాంటి వారిని గుర్తించి బాబు క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మొత్తానికి కొందరు తమ్ముళ్ళు తెలివిమీరిపోయినట్లే కనిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version