జగన్ పాలన అంటే నిరుద్యోగమని, మద్యం, డ్రగ్స్ అని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి చెప్పారు. గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబ్జి మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రం ఎక్కడ చూసినా మద్యం గంజాయి డ్రగ్స్ నిరుద్యోగం తాండవిస్తోందని అన్నారు. దోపిడీలు నిత్యకృత్యం అయిపోయాయని చెప్పారు దోపిడీల మీద ప్రశ్నిస్తున్న వారిని పోలీసులతో బెదిరిస్తున్నారని దాడులకి పాల్పడుతున్నారని రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
జగన్ గ్రామ పంచాయతీ వ్యవస్థని నాశనం చేసి వాలంటీర్ వ్యవస్థని పెట్టుకుని పాలన చేస్తున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని తీసేస్తారని పుకార్లు వస్తున్నాయని దీనిలో వాస్తవం లేదని వాలంటీర్ వ్యవస్థలో లోపాలు సరిచేసి కొనసాగిస్తామని అన్నారు.