శ్రీకాళహస్తి టీడీపీ సీటు కోసం బరిలో ముగ్గురు … చంద్రబాబు ఓటు అతనికే ?

-

చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గం శ్రీకాళహస్తిలో వైసీపీ ఎమ్మెల్యేగా బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీనే గెలుస్తుందన్న నమ్మకంను వ్యక్తపరుస్తున్నారు. ఇక ప్రతిపక్ష టీడీపీ సైతం శ్రీకాళహస్తిలో వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే అంటూ చెప్పుకుని తిరుగుతున్నారు. గెలుపు సంగతి అటుంచితే… ముందు ఎమ్మెల్యే అవ్యర్థిగా నిలిచే వ్యక్తి ఎవరూ అంటూ టీడీపీ కార్యకర్తలలో సందేహం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి రాజకీయ వారసుడిగా బొజ్జల సుధీర్ రెడ్డి ప్రస్తుతం నేనే ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ భ్రమలో ఉన్నాడు. కానీ మూడో కంటికి తెలియకుండా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఖరారు చేసేశారని రాజకీయ వర్గాలలో టాక్ వినబడుతోంది. శ్రీకాళహస్తిలో జంపింగ్ లీడర్ గా పేరున్న ఎస్ సి వి నాయుడు ఈ మధ్యనే టీడీపీ లో చేరిన విషయం తెలిసిందే. గతంలో కాంగ్రెస్ లో ఉండగా ఎమ్మెల్యే గా గెలిచిన ఎస్ సి వి నాయుడు వైసీపీ వచ్చాక కనుమరుగైపోయాడు. ఇప్పుడు టీడీపీలో చేరాక ఎమ్మెల్యే సీటు కోసం తన ప్రయత్నాలను సాగిస్తున్నాడు.

ఇక మునిరామయ్య అనే వ్యక్తి కూడా టీడీపీ ఎమ్మెల్యే సీటు కోసం బరిలో ఉన్నాడు. ఈ ముగ్గురు నాయకులు వచ్చే ఎన్నికల్లో టీడీపీ సీటు కోసం ఎదురుచూస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం రాజకీయాల్లో అనుభవం ఉన్న ఎస్ సి వి నాయుడు కే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news