ప్రధాని మోదీకి సవాల్ విసిరిన ఖర్గే

-

రేపు ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 30 పార్టీలు హాజరుకానున్నాయి. శివసేన, ఎన్సీపీ, అజిత్ వర్గం, పాశ్వాన్, జితన్ రామ్, ఉపేంద్ర సింగ్ లతోపాటు ఏపీ నుండి జనసేన, బీహార్ నుండి నాలుగు పార్టీలకు ఆహ్వానం అందింది. ఎన్డీఏ కూటమి బలోపేతమే లక్ష్యంగా బిజెపి ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి సవాల్ విసిరారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.

విపక్షాలను ఒంటి చేత్తో ఎదుర్కొనే దమ్ము ఉంటే ఎన్డీఏ సమావేశానికి 30 పార్టీలను ఎందుకు పిలిచారు అని ప్రశ్నించారు. విపక్షాలన్నీ ఏకతాటి పైకి వస్తుండడంతో మోడీ బెంబేలెత్తుతున్నారని.. అందుకే పార్టీలను చీలుస్తూ, చీలిక వర్గాలను పోగు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్డీఏ సమావేశానికి వస్తున్న పార్టీల పేర్లు చెప్పాలని సవాల్ విసిరారు ఖర్గే.

Read more RELATED
Recommended to you

Latest news