రాష్ట్రంలోని ప్రజలకు నిజంగా స్వాతంత్ర్యం ఉందా? అని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ప్రశ్నించారు. బ్రిటీషు వారు తమ స్వార్థం కోసం భారతీయులను కులం, మతం, ప్రాంతాల వారీగా విభజించి పాలించారని, జగన్ ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రవర్తిస్తోందని ఆయన ఆరోపించారు. లిక్కర్, శాండ్, ల్యాండ్, మైన్స్ వ్యాపారాల్లో ప్రభుత్వం మునిగి తేలుతోందన్నారు. పోలీసులు వైసీపీ వారికి పర్సనల్ సెక్యూరిటీ గార్డుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
మీడియాపై, ప్రశ్నించే వారిపై దాడి చేస్తున్నారన్నారు. దళిత మహిళపై పది మంది మూడు రోజులు అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్లో వదిలి వెళితే, ఆమెకు ఏం న్యాయం చేశారని నిలదీశారు. నామినేషన్ల సమయంలో మహిళలని కూడా చూడకుండా వారిని తడిమి చెక్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. బ్రిటీషు కాలం నాటికన్నా, అన్యాయమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయనడానికి ఇవే నిదర్శనాలని ఆయన మండిపడ్డారు.