యువతకు సీఎం జగన్… డ్రగ్స్ సప్లై చేస్తున్నారు : టీడీపీ ఎంపీ

సీఎం జగన్ యువతకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారని… టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు నిప్పులు చెరిగారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే బెణకని జగన్ కాలు.. ఢిల్లీ అంటే బెణికిందా..? సీఎం జగన్ ఒక పిరికిపంద అని ఫైర్‌ అయ్యారు. జగన్ చెప్పిన ప్రత్యేక హోదా ఎక్కడ ఉంది..? కేంద్రాన్ని హోదా అడగకుండా తాడేపల్లిలో తల దాచుకున్నారని మండిపడ్డారు.

ఏ అంశం పైనైనా టీడీపీ గాలి మాటలు మాట్లాడదని.. సాక్ష్యాధారాలతో మాట్లాడుతుందని డీజీపా గుర్తు పెట్టుకోవాలని… ఏపీలో డ్రగ్స్ మాఫియా నడుస్తుందన్నారు. ఏపీలో పోలీసు శాఖ ఎవరి కోసం పని చేస్తుందని…. టీడీపీని మాట్లాడద్దని చెప్పడానికి డీజీపీ ఎవరు..? అని ప్రశ్నించారు. డిజిపి, ఎస్పీలు, కమిషనర్లు ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తే ప్రతిపక్షానికి పోలీసు వ్యవస్థపై నమ్మకం ఎలా కలుగుతుందని.. తెలిపారు.  ఖాకి డ్రెస్ వేసుకుని ప్రజలకు సేవ చేయాలి కానీ పార్టీలకు కాదని… హేరాయిన్ అంశంలో వే బిల్లులు బయటకి తీయాలని డిమాండ్‌ చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.