దళితులను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయడంలో చంద్రబాబును మించిన వారు మరొకరు ఉండరని చాలామంది తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ రాజకీయ నేతలు అంటుంటారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన ప్రత్యర్థిని భయంకరంగా విమర్శించాలంటే ముందుగా చంద్రబాబు తన పార్టీలో ఉన్న దళితుడు చేత తిట్టిస్తాడని అంటారు బాబు గురించి తెలిసిన సీనియర్లు చాలామంది. తన స్వార్ధ రాజకీయాలకోసం చంద్రబాబు ఎంత దారుణానికి ఒడిగడతారని ఆ రకంగా తాజాగా రాజ్యసభ ఎన్నికలకు చంద్రబాబు రెడీ అవుతున్నారని ఇటీవల కామెంట్లు వినబడుతున్నాయి.మేటర్ లోకి వెళ్తే రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలని తెలిసి కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యని పోటీకి చంద్రబాబు దింపడం నిజంగా దారుణం అని చాలామంది అంటున్నారు. రాజ్యసభ ఎంపీ గెలవటానికి 41 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. ప్రస్తుతం వైసీపీకి ఉన్న బలం బట్టి చూస్తే కచ్చితంగా ఈజీగా వైసీపీ పార్టీ గెలవడం తథ్యం.
అంతేకాకుండా ఈ విషయం ఎప్పుడూ ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కచ్చితంగా ఇది గెలిచే స్థానం అయితే చంద్రబాబు దళితుడైన వర్ల రామయ్య కి అవకాశం ఇచ్చే వారా..? అంటూ ప్రత్యర్థి పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సందర్భంలో తాను గెలిచే పరిస్థితి కాని పొజిషన్ లో చంద్రబాబు నిలబెట్టడం వల్ల ‘ సార్ మీకోదండం నన్ను వదిలేయండి ” అంటూ సీనియర్ లీడర్ అయినా వర్ల రామయ్య దండం పెట్టేస్తున్నాడట.