ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడు ఓ పెద్ద సమస్య వచ్చిందా..? ఇది ఏపీ లోని 5కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యగా మారిందా..? ఈ సమస్యకు ఆజ్యం పోసింది ఎవ్వరు.. ? ఈ ఆత్మగౌరవ సమస్యను పట్టించుకోని వారు ఎవ్వరు..? ఐదేండ్లుగా పరిపాలన చేసిన ప్రభుత్వానిదా..? లేక ఐదేండ్ల తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానిదా…? ఏపీ ప్రజలను ఇప్పుడు వేధిస్తున్న ఈ సమస్య నుంచి గట్టేక్కెచ్చిందేవ్వరు..? ఈప్రశ్నలన్నింటికి గత ప్రభుత్వం చేసిన తప్పిదం 5కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందనే చెప్పవచ్చు.
టీడీపీ చేసిన తప్పిదం.. ఏపీ ప్రజలకు శాపంగా మారిందనే చెప్పవచ్చు. ఇంతకు టీడీపీ అధినేత, అప్పటి సీఎం చేసిన తప్పిదం ఏమిటీ..? ఓసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వం పొలిటికల్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని పేరు లేదు. కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు విడిపోయిన తర్వాత మోడీ సర్కార్ భారత దేశ పొలిటికల్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఇందులో 28 రాష్ట్రాలతో పాటు 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి.
అయితే కేంద్రం విడుదల చేసిన ఈ మ్యాప్‌లో అన్ని రాష్ట్రాలకూ రాజధానులను తెలిపింది.. కానీ ఒక్క ఏపీకి తప్ప. ఏపీ రాజధాని.. మ్యాప్‌లో లేకపోవడం. మనం ఇంత కాలం ఏపీ రాజధానిగా అమరావతి అని అనుకుంటున్నారు. కానీ కేంద్రం అసలు ఏపీకి రాజధాని ప్రాంతమే లేదని అది విడుదల చేసిన పొలిటికల్ మ్యాప్‌లో విడుదల చేయడం విశేషం. మరి కేంద్ర ప్రభుత్వం ఓ రాష్ట్రానికి రాజధాని లేకుండా పొలిటికల్ మ్యాప్‌ను ఎలా విడుదల చేసింది. అసలు ఏపీకి ఐదేండ్లు రాజధాని లేకుండానే పరిపాలన సాగించడం అనేది విడ్డూరమే మరి.
అయితే కేంద్రం ఏపీని విభజన చేసినప్పుడు హైదరాబాద్‌ను పదేళ్ళ ఉమ్మడి రాజధానిగా ప్రకటించింది. కానీ టీడీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో అమరావతి కేంద్రంగా చేసుకుని పరిపాలన చేసింది. ఉమ్మడి రాజధాని గా ఉన్న హైదరాబాద్ ను ఏపీ రాజధానిగా పొలిటికల్ మ్యాప్‌లో పేర్కోనకపోవడంతో అసలు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. అయితే ఐదేండ్లు పరిపాలన చేసిన టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రకటించి, గెజిట్ విడుదల చేయలేదని, కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళలేదని గతంతో మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపణలకు ఇప్పుడు కేంద్రం చేసిన ఈ చర్యకు ఊతమిచ్చినట్లు అయింది.
అంటే టీడీపీ ప్రభుత్వం ఏపీకి రాజధానిగా అమరావతిని ప్రకంచి, కేంద్ర ప్రభుత్వం చేత ఒప్పించి, రాష్ట్రపతి తో గెజిట్ విడుదల చేయాల్సిన అవసరం ఉండేది. కానీ టీడీపీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. దీంతో ఇప్పుడు ఏపీకి రాజధాని లేని పరిస్థితి లేకుండా పోయిందనే భావన ఏపీ ప్రజల్లో నెలకొని ఉంది. ఇప్పుడు ఏపీకి రాజధాని లేని రాష్ట్రంగా ఏపీకి రికార్డుల్లోకి ఎక్కిందనే చెప్పవచ్చు. ఈ సమస్యకు ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.