తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం నాటితో 30వ రోజుకు చేరింది. ఆ క్రమంలో ప్రభుత్వం మెట్టు దిగి రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. దాదాపు నెల రోజుల నుంచి సమ్మె జరుగుతున్నా.. ప్రభుత్వం మాత్రం కదిలిరావడం లేదు. ఇక తాజాగా ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు ఆర్టీసీ కార్మికుల సెగ తగిలింది.
బీరంగూడలో జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్న హరీశ్‌ను కార్మికులు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీహెచ్‌ఈఎల్ డిపో కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. హరీశ్ రావును అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు కార్మికులను అరెస్టు చేశారు.