తిరుపతి నామినేషన్ కార్యాలయం వద్ద కొట్టుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు..!

-

ఎన్నికల హీట్ ఇప్పటికే ఎక్కువై పోయింది. పార్టీ నాయకులందరూ కూడా ప్రచారాలని మొదలుపెట్టేశారు. వైసీపీ తో పాటుగా టిడిపి జనసేన బిజెపి కూటమి కూడా జోరుగా ప్రచారాలని జరుపుతున్నాయి. అయితే ఎన్నికల కారణంగా అక్కడక్కడ గొడవలు వంటివి కూడా చూస్తున్నాము. తాజాగా తిరుపతి నామినేషన్ కార్యాలయం వద్ద నామినేషన్ వేయడానికి వెళ్లిన వైసిపి టిడిపి నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

తిరుపతి నామినేషన్ కార్యాలయానికి వెళ్లిన వైసిపి, టీడీపీ నాయకులు నామినేషన్ వేసి వస్తున్న క్రమంలో కొట్టుకున్నారు. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నామినేషన్ సెంటర్ దగ్గర కొట్టుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలకి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. నామినేషన్ కార్యాలయం వద్ద వైసీపీ టిడిపి నాయకులు మధ్య వాగ్వాదం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version