మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఘోరం.. విద్యార్థినిపై వేధింపులు

-

విద్యా నేర్పించాల్సిన ఉపాధ్యాయులే అవివేకంగా ప్రవర్తిస్తున్నారు. ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా విద్యార్థులపై వేధింపులకు పాల్పడుతున్నారు. అయితే.. ఓ ఉపాధ్యాయురాలు వేధింపులు భరించలేక ఓ బాలిక హాస్టల్‌ నుంచి తప్పించుకొని తన ప్రాణాలు కాపాడుకుంది. జాతీయ రహదారిపై నడుచుకుంటూ వస్తున్న విద్యార్థిని గమనించిన 161 వ జాతీయ రహదారి హైవే పెట్రోలింగ్ సిబ్బంది విద్యార్థిని గమనించి ఆపారు. మీది ఏ ఊరు… ఎక్కడి నుంచి వస్తున్నావ్.. ఎక్కడికి వెళ్లాలి అని వివరాలు అడిగి.. ఈ సమయంలో ఎందుకు వచ్చావు అంటూ సిబ్బంది అడిగారు. దీంతో హాస్టల్ లో జరుగుతున్న విషయాలను హైవే పెట్రోల్ సిబ్బందికి విద్యార్థిని తెలిపింది.హైవే పెట్రోలింగ్ సిబ్బందితోపాటు స్థానికుల కథనం ప్రకారం నిజాంపేట్ మండలం బాచుపల్లిలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శృతి అనే విద్యార్థిని అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి ఏ సెక్షన్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు శృతి అనే విద్యార్థిని నిత్యం వేధింపులకు గురి చేస్తుందని ఆరోపించారు.

 

టీచర్ వేధింపులు భరించలేక ఆదివారం సాయంత్రం హాస్టల్ నుంచి బయటకు వచ్చి.. 161వ జాతీయ రహదారి మీదుగా బాచేపల్లి నుంచి స్వగ్రామమైన నిజాంపేట్ కు వస్తుండగా హైవే పెట్రోల్ సిబ్బంది గమనించినట్లు తెలిపారు. విద్యార్థి నుంచి వివరాలు తీసుకుని వారి ఇంటికి చేర్చారు. అకస్మాత్తుగా తన కూతురు ఎందుకు హాస్టల్ నుంచి వచ్చిందో తెలుసుకునే లోపే హాస్టల్ సిబ్బంది విద్యార్థిని ఇంటికి చేరుకుని విషయం బయటకు రాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పి రాత్రి 7:30 గంటల ప్రాంతంలో తిరిగి హాస్టల్ కు తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినీలు గత మూడు నెలల మాసంలోనే ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మరువకముందే మరో విద్యార్థిని టీచర్ వేధింపులు భరించలేక బయటకు రావడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. దీనిపై జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version