ఏపీలో దారుణం.. విద్యార్థినులపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు..!

-

ఈ మధ్య కాలంలో ముఖ్యంగా అమ్మాయిల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు భయం భయంతో బతుకుతున్నారు. తమ కూతురుకు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కామాంధుల వల్ల ఎన్నో కుటుంబాలు బలవుతున్నాయి. తోటి వారు, పక్కవారు, పొరిగింటివారు, స్నేహితులు, బంధువులు ఇలా ప్రతీ ఒక్కరితో కూడా ఇబ్బందులు తలెత్తడం లేదు.

విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు దారి తప్పుతున్నారు. ఇలాంటి ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లో బుధవారం వెలుగు చూసింది. కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్ధినులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. భయాందోళన చెందిన విద్యార్థినులు విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపారు. కోపోద్రిక్తులైన వారు ఉదయం పాఠశాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఉపాధ్యాయుడు రాగానే పాఠశాలలో బంధించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు, మండల విద్యాధికారి తైమూరు భాష, ఇతర అధికారులు వెంటనే గ్రామానికి చేరుకొని ఉపాధ్యాయని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news