తెలంగాణా బడ్జెట్ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే

-

తెలంగాణా ఆర్ధిక మంత్రి హరీష్ రావు ఆ రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మహిళల సంక్షేమ, వెనుకబడిన వర్గాల సంక్షేమ, పారిశ్రామిక రంగం, రైతు సంక్షేమ, సాగునీటి ప్రాజెక్ట్ లు ఇలా అన్ని రంగాలకు భారీగా నిధులు కేటాయించారు. అన్ని రంగాల అభివృద్దికి తెలంగాణా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, ప్రతీ రంగంలో అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, తెలంగాణా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి కృషి చేస్తామని చెప్పారు.

అసలు ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారు అనేది చూస్తే…

తెలంగాణ తలసరి ఆదాయం =2 లక్షల 28 వేల 216
దేశం తలసరి ఆదాయం లక్ష 35 వేల 050 కోట్లు

రైతు బంధుకి 14 వేల కోట్లు,
అటవీ శాఖకు 791 కోట్లు
ఉన్నత విద్య శాఖకు 1,723 కోట్లు
వైద్య రంగానికి 6,186 కోట్లు
ఫీజు రీఎంబెర్స్మెంట్ 2,650 కోట్లు
పాఠశాల విద్యాశాఖకు 10421 కోట్లు
పంచాయితీ రాజ్ గ్రామీణాభివృధికి 23005 కోట్లు
మున్సిపల్ శాఖకు 14809 కోట్లు
బీసీ సంక్షేమం 4356 కోట్లు
మహిళా సంఘాలకు 1200 కోట్లు
కల్యాణ లక్ష్మికి 1350 కోట్లు
ఎంబీసీ కార్పొరేషన్ కి 500 కోట్లు
మైనార్టీ కోసం 1518 కోట్లు
పశుపోషణ ,మత్స్యశాఖకు 1586 కోట్లు
ఎస్సి ప్రగతి 16534 కోట్లు
ఎస్టీల ప్రగతి 9771 కోట్లు
ఆసరా పెన్షన్స్ 11,758 కోట్లు
దేవాలయాల అభివృద్దికి 500 కోట్లు,
పారిశ్రామిక రంగానికి 1,998 కోట్లు,
పారిశ్రామిక ప్రోత్సాహకాలకు 1,500 కోట్లు
సాగు నీటి పారుదలకు 11,054 కోట్లు
రైతు రుణ మాఫీ కోసం 1,198 కోట్లు
హైదరాబాద్ అభివృద్దికి 10 వేల కోట్లు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒక్కొక్కరికి 3 కోట్ల నిధులు
ఎమ్మెల్సీల నిధులకు 480 కోట్ల
రైతు బీమా 1,141 కోట్లు
మైక్రో ఇరిగేషన్ కి 600 కోట్లు..కేటాయించారు.

Read more RELATED
Recommended to you

Latest news