ఆసియ కప్ కు ముందు టీమిండియాకు షాక్..తగిలింది. ఇండియన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నేపథ్యంలోనే విరామం తీసుకున్న టీం ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కు తాజాగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలోనే టీం ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో టీం ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కు ఆసియా కప్ నకు దూరం కానున్నారు.
అంటే ఆదివారం (ఆగస్టు 28) న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనున్న ఆసియా కప్ 2022 మ్యాచ్ కు ద్రవిడ్ దూరం కానున్నాడన్న మాట. జింబాబ్వే పర్యటనకు ద్రవిడ్ స్థానంలో VVS లక్ష్మణ్ కోచ్ బాధ్యతలను స్వీకరించాడు. జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 3-0తో విజయం సాధించింది. అయితే.. ఇప్పుడు ద్రావిడ్ కు కరోనా రావడంతో.. టీమిండియా తాత్కాలిక కోచ్ గా VVS లక్ష్మణ్ నే బీసీసీఐ కొనసాగించే ఛాన్స్ ఉంది.