నేడు కేఆర్ఎంబి త్రిసభ్య కమిటీ సమావేశం

-

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణ ప్రాజెక్టుల నుంచి నీటి కేటాయింపులపై చర్చించేందుకు నేడు మధ్యాహ్నం కృష్ణ బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించనుంది. హైదరాబాదులోని జల సౌధాలో నిర్వహించనున్న ఈ సమావేశానికి హాజరుకావాలని బోర్డు రెండు రాష్ట్రాలకు సమాచారం పంపింది. నీటిని కేటాయించాలంటూ రెండు రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. కృష్ణా జలాల విడుదలతో పాటు, జల విద్యుత్ ఉత్పత్తి, రూల్ కర్వ్స్, వరద జలాల అంశాలపై కేఆర్ఎంబి కమిటీలు సమావేశం కానున్నాయి.

2022 – 23 నీటి సంవత్సరంలో సాగు, తాగునీటి అవసరాల కోసం.. నీటి విడుదల ఉత్తర్వులు ఇచ్చేందుకు బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలపై సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారు. మూడు అంశాలపై సిఫారసులకు సంబంధించి రూపొందించిన నివేదికపై సమావేశంలో చర్చిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news