కుప్పకూలిన టాప్ ఆర్డ్‌ర్.. టీమిండియా 103 పరుగులకే ఆరు వికెట్లు

-

కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు మొదటి, రెండు సెషన్లలో కివీస్ పైచేయి సాధించింది. బౌలర్లు రాణించడంతో టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శ్రేయస్ అయ్యర్(25), రవిచంద్రన్ అశ్విన్ (32) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 106 పరుగుల వద్ద రవిచంద్రన్ అశ్విన్ జెమిసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్(25), వృద్ధిమాన్ సహా ఉన్నారు.

రెండో ఇన్నింగ్స్‌లో రెండు పరుగులకే తొలి వికెట్‌ను టీమిండియా కోల్పోయింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (1) పరుగుకే వెనుతిరిగాడు. ఓవర్‌నైట్ స్కోర్ ఐదు పరుగుల వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా బ్యాట్స్‌మెన్ క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. పిచ్ బౌలింగ్ సహకరిస్తుండటంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయారు. మయాంక్ అగర్వాల్(17), ఛతేశ్వర్ పుజారా(22), అజింక్య రహానే (4), రవీంద్ర జడేజా(0), రవిచంద్రన్ అశ్విన్(32) పరుగులకే అవుటయ్యారు. జెమిసన్(3), టిమ్ సౌథీ(2), ఆజాజ్ పటేల్(1) వికెట్లు తీసుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news