టీజర్: ఆరు గెటప్పులతో సర్దార్ గా వస్తున్న కార్తీ..!!

-

విభిన్నమైన సినిమాలతో ఎప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు తమిళ హీరో కార్తీ. ఇక ఈ రోజున డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నీయన్ సెల్వన్ -1 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా కూడా మంచి విజయంతో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఇక కార్తీ నటించిన సిద్ధార్ సినిమా దీపావళి పండుగ సందర్భంగా తమిళ్, తెలుగు ప్రేక్షకుల ముందుకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం. ఈ చిత్రానికి దర్శకత్వం పిఎస్ మిత్రన్ వ్యవహరించారు. ఇందులో రాశి ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో చాలా రోజుల తర్వాత హీరో కార్తీ చాలా విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమా పై అంచనాలు పెంచేశాయి. ఇక ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వయసు మళ్ళిన సర్దార్ పాత్రలో కార్తీ కనిపించనున్నారు. ఇక సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ చాలా వేగవంతం చేశారు. ఈ రోజున ఈ సినిమాకు సంబంధించి టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది.

ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే ఇందులో ఎన్నో రహస్యాలు చేదించే దిశగా కనిపిస్తున్నాయి. కార్తీ కూడా ఇందులో ఆరు విభిన్నమైన గెటప్ లలో కనిపించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 24న తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ చిత్రంతో ప్రేక్షకులకు తెలియని ఒక కొత్త విషయాన్ని చూపించబోతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ టీజర్ కాస్త వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version