పవన్ వర్సెస్ ఎన్టీఆర్..టీడీపీని లేపేది ఎవరు?

-

జూనియర్ ఎన్టీఆర్‌ని టీడీపీ శ్రేణులు దాదాపు దూరం చేసుకున్నట్లే కనిపిస్తున్నాయి. అసలు జూనియర్ సపోర్ట్ తమకు వద్దు అని తెలుగు తమ్ముళ్ళు గట్టిగానే చెబుతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై, గతంలో భువనేశ్వరిపై వైసీపీ నేతలు దారుణంగా మాట్లాడటంపై ఎన్టీఆర్ స్పందించిన తీరుపై తమ్ముళ్ళు మండిపడుతున్నారు. అసలు స్పందించకుండా ఉంటే బాగుండేది అని అంటున్నారు. అయితే సినీ రంగంలో టాప్ లో ఉన్న ఎన్టీఆర్ అందరివాడుగా ఉండటానికే ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

దీన్ని టీడీపీ శ్రేణులు తప్పుబడుతున్నాయి. ఇప్పటివరకు ఎన్టీఆర్ మద్ధతు వస్తుందని ఏదో రకంగా ఆశపెట్టుకున్నారు. కానీ తాజా స్పందనతో ఎన్టీఆర్ పై తమ్ముళ్ళు ఆశలు వదులుకున్నారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ లేకపోతే టీడీపీకి భవిష్యత్ లేదని..ఆయన అభిమానులు మాట్లాడుతున్నారు. తమకు ఎన్టీఆర్ మద్ధతు అక్కర్లేదు అని లోకేష్ ఉన్నారు చాలు అని తమ్ముళ్ళు అంటున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మద్ధతుగా ఉండాలి గాని..ఇలా రెండు పడవలపై కాలు వేయకూడదని అంటున్నారు.

అయినా లోకేష్ పార్టీ కోసం కష్టపడుతున్నారని, ఆయనే పార్టీకి భవిష్యత్ అని మాట్లాడుతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ పై తమ్ముళ్ళు అసలు వదులుకున్నట్లే కనిపిస్తున్నారు. ఇదే సమయంలో కొందరు తమ్ముళ్ళు..పవన్ మద్ధతుపై ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో పవన్‌తో పొత్తు ఉంటే టీడీపీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. పొత్తు ఉంటే వైసీపీని ఓడించడం ఈజీ అని అనుకుంటున్నారు.

వాస్తవానికి పవన్‌తో పొత్తు ఉంటే టీడీపీకి కాస్త కలిసొస్తుంది. కాకపోతే పొత్తుపై ఇప్పుడే క్లారిటీ వచ్చేలా లేదు. అలాగే కొందరు తమ్ముళ్ళు ఎవరి మద్ధతు లేకుండానే ముందుకెళ్లాలని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ విషయంలో మాత్రం బాగా సీరియస్ గా ఉన్నారు. మొత్తానికి టీడీపీకి లోకేష్ ఉన్నారని, అలాగే పొత్తు ఉంటే టీడీపీకి పవన్ ప్లస్ అవుతారని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version