భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. జార్ఖండ్ ఎన్నికల
ప్రచారంలో పాల్గొన్న ప్రధాని, తిరిగి ఢిల్లీకి వచ్చే సమయంలో విమానంలో టెక్నికల్ స్నాగ్ ఏర్పడింది. జార్ఖండ్ డియోఘర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక లోపాన్ని సరిదిద్దే వరకు విమానం అక్కడే ఉంటుంది. దీంతో ప్రధాని ఢిల్లీకి తిరిగి రావడం ఆలస్యం కానుంది.
గిరిజనుల ఐకాన్ బిర్సా ముండా వార్షికోత్సవాన్ని జన జాతీయ గౌరవ్ దివస్ జరుపుకునేందుకు.. దీంతో పాటు నవంబర్ 20న జార్ఖండ్ రాష్ట్రంలో జరగబోయే రెండో విడత అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత, తిరిగి ఢిల్లీకి బయలుదేరినప్పుడు ఈ సమస్య తలెత్తింది. సాంకేతిక లోపాన్ని సరిచేసే ప్రక్రియ పూర్తయ్యే వరకు విమానం అక్కడే నిలిపివేశారు. ఈ కారణంగా ప్రధాని ఢిల్లీకి చేరుకోవడం కొద్దిగా ఆలస్యం కానుంది. ఇవాళ ప్రధాని మోడీ రెండు ర్యాలీల్లో ప్రసంగించారు.