ట్రాన్సిషన్ ఇండియా కంపెనీ టెక్నో స్పార్క్ గో 2020 పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. స్పార్క్ సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. 6.52 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో ఎ20 క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. 2జీబీ ర్యామ్‌ను ఏర్పాటు చేశారు. వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా రెండు ఏఐ డ్యుయల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక వైపు ఉంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు.
టెక్నో స్పార్క్ గో 2020 స్పెసిఫికేషన్లు…
* 6.52 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1500 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 1.8 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ హీలియో ఎ20 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్
* 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్
* డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
టెక్నో స్పార్క్ గో స్మార్ట్ ఫోన్ ఐస్ జేడియట్, ఆక్వా బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. రూ.6,499 ధరకు ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 7 నుంచి లభిస్తుంది.