సీఎం పదవి ఆ యువనేతను వరించినట్టేనా…?

-

తేజస్వీ యాదవ్… ఇప్పుడు బీహర్ రాజకీయ ముఖ చిత్రంపై వెలుగుతున్న యువ నేత . బీహర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలన్నీ మహ ఘట్‌బంధన్‌ వైపు మొగ్గు చూపుతుండడంతో.. అందరి చూపూ ఈ ఆర్జేడీ యువనేత వైపు మళ్లింది. లాలు కుటుంబంలో అందరి కంటే చిన్నవాడైన తేజస్వి.. బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి, కూటమికి పెద్ద దిక్కుగా నిలిచారు.

బీహర్ అసెంబ్లీ ఎన్నికల తుదిదశ పోలింగ్‌ ముగియగానే… ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయి. పలు సంస్థలు నిర్వహించిన సర్వేలన్నీ… మహ ఘట్ బంధన్‌ వైపే మొగ్గు చూపాయి. బీహార్‌ కొత్త సీఎంగా యువ నాయకుడు తేజస్వి యాదవ్ కే జనం జై కొట్టబోతున్నట్టుగా అభిప్రాయపడ్డాయి. హోరాహోరీగా సాగిన బీహర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో RJD యువ నేత తేజస్వీ యాదవ్ అందరి దృష్టిని అకర్షించారు. తేజస్వీ సభలకు భారీగా జనం తరలి వస్తుండడంతో బీహర్ ఫలితాలపై అప్పుడే విశ్లేషణలు మొదలయ్యాయి. మహ ఘట్‌ బంధన్‌ ఓడినా గెలిచినా బీహర్ రాజకీయల్లో ఇకపై తేజస్వీ యాదవ్ ప్రముఖ పాత్ర పోషించబోతున్నారనే చర్చ మొదలైంది.

RJDలో సింగిల్ ఫేస్‌గా ప్రచారం నిర్వహించిన తేజస్వీ యాదవ్.. పార్టీ మ్యానిఫేస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. మహ ఘట్‌బంధన్‌ సీఎం అభ్యర్గిగా హై ఓల్టెజ్‌లో ప్రచారం నిర్వహించిన తేజస్వీ.. ఎన్డీఏను గట్టిగానే ఢీకొట్టారు. సీఎం నితీష్‌ను టార్గెట్‌ చేస్తూనే.. తమ పది లక్షల ఉద్యోగాల హమీని కూడా జనంలోకి తీసుకెళ్లారు తేజస్వి. ఘట్‌బంధన్‌లోని కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీలు సైతం.. తేజస్విని తమ నాయకుడిగా చెప్పుకోవడానికి ఏమాత్రం వెనుకంజ వేయలేదు.

లాలు ప్రసాద్, రబ్రీ దేవి దంపతుల 8 మంది సంతానంలో చివరివాడైన తేజిస్వీ యాదవ్… 2017వరకు తండ్రిచాటు బిడ్డగానే రాజకీయాలు చేశారు. ఆ తర్వాత లాలూ కాస్త సైడవడంతో.. పార్టీకి అంతా తానై నడిపించారు తేజస్వీ. ప్రత్యర్థుల విమర్శలకు ధీటుగా బదులిస్తూ.. బీహార్‌ జనాల చూపును తనవైపు తిప్పుకున్నారు. మెల్లగా తండ్రి లాలూ యాదవ్ నీడ నుంచి బయపడేందుకు తేజస్వీ చేసిన ప్రయత్నం కూడా ఫలించిందనే చెప్పాలి. లాలూకు భిన్నంగా అభివృద్ది నినాదాన్ని ఎత్తుకున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో.. సూటిగా చెప్పారు. లాలు కుటుంబంలో చిన్నవాడైనా.. అందరిని కన్విన్స్ చేసి … సింగిల్‌ లీడర్‌గా ఎదిగి ఇప్పుడు బీహార్‌ రాజకీయాల్లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version