బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో త్రుటిలో విజయాన్ని చేజార్చుకున్న మహాకూటమి ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుపై చాలా ధీమాగా ఉంది. తాజాగా మహాకూటమి సిఎం అభ్యర్ధి తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మహాగట్ బంధన్ బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేసారు. తేజశ్వి యాదవ్ మరికొన్ని వ్యాఖ్యలు చేసారు.
అందరు ఆర్జేడీ ఎమ్మెల్యేలను పాట్నాలో ఒక నెల పాటు ఉండాలని, ఇంకా తమ నియోజకవర్గాల నుంచి తిరిగి రావాలని కోరారు. ఎన్డియేలో ఇంకా ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత లేదు అని, కొన్ని పార్టీలు అసహనంగా ఉన్నాయని, ఎప్పుడైనా ఏదైనా జరగోచ్చు అని, తనకు ఒక ప్రణాళిక ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఓట్ల లెక్కింపు విషయంలో జరిగిన అంశాలపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు.