తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

తెలంగాణ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ స్థానంలో ప్రభుత్వం కొత్త వ్యవస్ధను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో గ్రామ స్థాయిలో జూనియర్ అసిస్టెంట్ లను నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే ప్రస్తుతం జోనల్ పోస్టుల సర్దుబాటు అవ్వగానే ఈ పోస్టుల నియామకం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

మొదట మండలానికి పది పోస్టుల చొప్పున 1800 ల పోస్టులను వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్ లో అవసరాలను బట్టి ఐదు వేలకు పైగా పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయాలని కేసీఆర్ గతంలోనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.