డెంగ్యూ డేంజర్.. చిన్నారులు జాగ్రత్త.. నీలోఫర్ లో పెరుగుతున్న కేసులు.

-

కరోనా మహమ్మారి ఇంకా వెళ్ళకముందే డెంగ్యూ రక్కసి తన పంజా విసురుతుంది. దోమకాటు ద్వారా వచ్చే ఈ వ్యాధి, ఎక్కువ మందిలో వ్యాపిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలపై డెంగ్యూ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తాజాగా హైదరాబాద్ లో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రిలో 9యూనిట్లు నిండిపోయాయి. ఎన్ఐసీయూలో 250వరకు చిన్నపిల్లలు ఉన్నారు. అలాగే మొత్తం 800మంది చిన్నపిల్లలు జాయిన్ అయ్యారు. వీరందరిలో 30నుండి 40శాతం డెంగ్యూ లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

చిన్నపిల్లలపై డెంగ్యూ ప్రభావం ఎక్కువగా ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరాన్ని పూర్తిగా కప్పేసే డ్రెస్సులు ధరించడం, పరిశుభ్రమైన నీటిని తాగడం, నీటి నిల్వ ఎక్కడా లేకుండా చూసుకోవడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే, దోమల సంఖ్య పెరగకుండా ఉంటుందని, తద్వారా డెంగ్యూ ప్రభావాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news