Telangana :ఇల్లెందు అన్నపూర్ణకు అండగా నిలిచిన కేటీఆర్…

-

ప్రజల కష్టాలు విని వారికి అండగా ఉంటామని అధికారంలోకి వచ్చిన వారం రోజులపాటు హడావిడి చేసిన ప్రజా దర్బార్ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తుంది. ప్రజాదర్బార్ లో తన సమస్యను చెప్పుకుంటే పరిష్కారం చూపిస్తారని కొండంత ఆశతో వందల కిలోమీటర్లు ప్రయాణించి నగరానికి చేరుకున్న ఇల్లందు పట్టణానికి చెందిన అన్నపూర్ణ కి నిరాశ ఎదురయింది.సమస్య తీరక బాధతో వెనుదిరిగిన ఆమెకి కెసిఆర్ అండగా నిలబడి తన సమస్యను తెలుసుకున్నాడు. బంజారాహిల్స్ లోని తన నివాసానికి పిలిపించుకొని తన కూతురి నర్సింగ్ చదువు కోసం కావలసిన లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

 

ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ ప్రసార మాధ్యమాలలో ప్రజా దర్బార్ గురించి విని నగరానికి వచ్చానని కానీ అక్కడ తన సమస్యల గురించి వివరించినప్పటికీ ఎవరు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. నాలుగుసార్లు దరఖాస్తు చేసుకున్న ఎవరు పట్టించుకోలేదని తెలిపింది. అసెంబ్లీకి వెళ్లి ముఖ్యమంత్రి కోసం రోజంతా కాపలా కాస్తే పోలీసులు వెళ్లగొట్టారని చెప్పింది.

అయితే అక్కడ ఉన్న కొందరు తెలంగాణ భవన్ కి వెళ్లి కేటీఆర్ ను కలిసి సమస్యను వివరిస్తే పరిష్కారం లభిస్తుందని చెప్పారని తెలిపింది. తన సమస్యలను విన్న కేటీఆర్ లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయడంతో అన్నపూర్ణ సంతోషం వ్యక్తం చేసింది. సహాయం చేసిన కేటీఆర్ కి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news