ఇటీవలే ముగిసిన భారత్ రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నికను రెజ్లర్లు తట్టుకోలేకపోతున్నారు. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న సంజయ్ సింగ్ ఎన్నికలలో గెలవడంతో రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా మరో రెజ్లర్ బజరంగ పునియా తన పద్మశ్రీని వెనక్కి ఇస్తున్నానంటూ ప్రకటన చేశాడు.
వీరికి మద్దతుగా మరో పారా రెజ్లర్ వీరేంద్ర సింగ్ తన పద్మశ్రీని కూడా వెనుకకి ఇస్తున్నట్టు ప్రకటించాడు.
ఇదిలా ఉంటే… కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ నిబంధనలు ఉల్లంఘించారని డబ్ల్యూ ఎఫ్ ఐ పాలకవర్గాన్ని సస్పెండ్ చేసింది. తాత్కాలిక పానెల్ ని ఏర్పాటు చేయమని భారత ఒలంపిక్ సంఘమును కేంద్రం క్రీడల మంత్రిత్వ శాఖ కోరింది.అథ్లెట్ల ఎంపికను , వివిధ వ్యవహారాలను చూడమని ఐఓఏ కి రాసిన లేఖలో డబ్ల్యూ ఎఫ్ ఐ పేర్కొంది.