తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత నుండి రెండు సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ రెండు ఎన్నికలలోనూ కేసీఆర్ నేతృత్వం లో ఉన్న BRS పార్టీ విజయాన్ని సాధించి వరుసగా రెండు సార్లు అధికారంలోకి రావడం జరిగింది. ప్రస్తుతం కేసీఆర్ సీఎంగా ప్రజలకు సుపరిపాలన అందిస్తూ మూడవ సారి కూడా గెలవడానికి తగిన ప్లాట్ ఫామ్ ను సిద్ధం చేసుకున్నాడు. కాగా మరో అయిదు నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో తెలంగాణాలో ఎన్నికల సంఘం అధికారులను మరియు మిగిలిన ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటోంది. తాజాగా ఈ రోజు తెలంగాణకు అదనపు ఎన్నికల ప్రధాన అధికారిగా లోకేష్ కుమార్ ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఇక రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధాన అధికారిగా సర్ఫరాజ్ ను నియమించింది.
ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి వీరి నేతృత్వంలో ఈసారి హోరాహోరీగా జరగనున్న ఎన్నికలను ఏ విధంగా జరపనున్నారు అంది తెలియాలంటే డిసెంబర్ వరకు ఆగాల్సిందే.