తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. ద్రవ్య మినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 7 రోజులు జరిగాయి. ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తం 52.25 గంటల పాటు సాగాయి. అలాగే తెలంగాణ పంచాయతీ రాజ్ సవరణ బిల్లుకు ఆమోదముద్ర పడింది. టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా మారిన తరువాత తొలిసారి నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు ఇవే.
ఈ సమావేశాలలో 38 ప్రశ్నలకు సమాధానం లభించింది. ఇక నేడు సీఎం కేసీఆర్ ద్రవ్య వినిమయ బిల్లు పై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కృష్ణ, గోదావరి జలాలు వస్తున్నాయని చెప్పారు. కాలువలలో నీళ్లు ఎలా పారుతున్నాయో రేపు మా డబ్బాలలో కూడా ఓట్లు పారుతాయని అన్నారు సీఎం కేసీఆర్.