తెలంగాణ అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు రెండు కీలక బిల్లులు ప్రవేశ పెట్టారు. అందులో ఒకటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల వైద్య ఖర్చుల కోసం చట్ట సవరణ కాగా ఆ సవరణ ప్రకారం పది లక్షల వరకు సాయం అందేలా చేసిన బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అలాగే గరిష్ట పెన్షన్ ని 50 వేల నుండి 70 వేలకు పెంచారు.
ఉద్యోగుల వయోపరిమితి 61 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టగా దానికి కూడా ఆమోదం లభించింది. ఈ వయోపరిమితి పెంపుతో ఎవరికీ నష్టం లేదని, హరీష్ రావు పేర్కొన్నారు. వెంటనే ఖాళీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొన్నారు. ఇక ఇవాల్టితో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. రేపు సభలో ద్రవ్యవినిమాయ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.