తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఖరారు అయింది. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఈ నెల 19వ తేదీన బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఇక ఈ తరుణంలోనే… నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఎల్పీ సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం జరుగనుంది. అసెంబ్లీ కమిటీ హాలు -1లో ఈ సమావేశం జరగనుంది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేయనున్నారు.