తెలంగాణా బిజెపి ఇలా మారితే బెస్ట్

-

జాతీయ స్థాయిలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలు చాలా వరకు సీరియస్ గా తీసుకోవాలి. అయితే భారతీయ జనతా పార్టీ నేతలు తెలంగాణ విషయంలో పెట్టిన దృష్టి కొన్ని అంశాల మీద పెట్టలేకపోతున్నారు. తెలంగాణలో ఎలా అయినాసరే బలపడాలని పట్టుదలగా ఉన్న బిజెపి నేతలు ఇక్కడ ఉన్న కొన్ని కొన్ని అంశాల్లో విఫలమవుతున్నారు అనే అభిప్రాయం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో కూడా వ్యక్తమవుతోంది.

తెలంగాణ లో సీఎం కేసీఆర్ ని ఎదుర్కోవాలి అంటే కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా ఇక్కడ మత రాజకీయం చేయకుండా ఉండటమే మంచిది. జాతీయస్థాయిలో ఇప్పుడు బీజేపీపై మత రాజకీయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీ అదే రాజకీయం చేస్తోందనే భావన ఉంది. కాబట్టి తెలంగాణలో కూడా అదే రాజకీయం చేయడం వలన బీజేపీకి పెద్దగా కలిసి వచ్చేది ఏమీ లేదు.

కాబట్టి ఇక్కడ అభివృద్ధి విషయంలో రాజకీయం చేస్తే బాగుంటుందని భావన ఉంది. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది… తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది… అక్కడ ఉద్యోగ నియామకాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఉద్యోగ నియామకాలు ఏ విధంగా ఉన్నాయి అనే దానిపై బీజేపీ నేతలు విమర్శలు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అనవసరమైన అంశాలను ఎక్కువగా టార్గెట్ చేస్తూ వెళ్తే బీజేపీ నేతలు ప్రజల్లో చులకన అవుతారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మత రాజకీయం చేయకుండా ఉండటమే మంచిదనే భావన చాలా మందిలో ఉంది. వాస్తవానికి ఆ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ కి దగ్గరగా ఉంది కాబట్టి మతం ప్రభావం ఉండకపోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news