వైఎస్‌ తరహాలో… బండి సంజయ్ పాదయాత్ర : ఆగస్టు 9 నుంచి ప్రారంభం

-

టీపీసీసీగా రేవంత్‌ రెడ్డి నియామకం కావడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. రేవంత్‌ ఎఫెక్ట్‌తో.. బండి సంజయ్ క్రేజ్‌ తగ్గుతుందంటూ తెలంగాణ కొత్తగా చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు కేసీఆర్‌ కు.. కొరకరాని కొయ్యగా తయారైన బండి సంజయ్‌.. రేవంత్‌ రాకతో కాస్త సైలెంట్‌ అయినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కంటే… ఎక్కువగా దూకుడు ప్రదర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇవాళ పార్టీ నేతలతో భేటీ అయిన..బండి సంజయ్.. పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గడీల పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ఆగస్ట్ 9 న మహాపాద యాత్ర చేయనున్నట్లు ప్రకటించారు బండి సంజయ్‌. క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్పూర్తి గా తీసుకొని పాదయాత్ర నిర్వహిస్తామని పేర్కొన్నారు. భాగ్యనగర్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుండి పాద యాత్ర ప్రారంభించి…హుజూరా బాద్ వరకు పాదయాత్ర చేస్తామని స్పష్టం చేశారు బండి సంజయ్‌.  మాజీ సీఎం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన రూట్ లోనే చేయనున్నట్లు చెప్పిన బండి సంజయ్‌… మొత్తం 55 రోజుల్లో 750 కిలోమీటర్లు పాదయాత్ర ఉండనున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version