వేరే పార్టీలకు రాజకీయాలు గేమ్.. టీఆర్ఎస్ కు మాత్రం పవిత్రమైన కర్తవ్యం- సీఎం కేసీఆర్

-

వేరే పార్టీలకు రాజకీయాలు గేమ్..టీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఓ టాస్క్ అని, పవిత్రమైన కర్తవ్యం అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో నేను కూడా సిద్ధిపేటలో లాఠీ దెబ్బలు తిన్నానని కేసీఆర్ అన్నారు.  గుప్పెడు మందితో ప్రారంభమైన తెలంగాణ 17 ఏళ్ల సుదీర్ఘపోరాటం తరువాత వచ్చింనది అన్నారు. ఇప్పటికీ ఉద్యమంలో పాల్గొన్న మంత్రులు కేసులను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పుడు అడ్డదిడ్డంగా మాట్లాడే వారు ఆనాడు ఉద్యమంలో ఎక్కడ ఉన్నారో తెలియదని అన్నారు. తెలంగాణ ఉద్యమం ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఒకప్పుడు తెలంగాణ భాష మాట్లాడే వారిని సినిమాల్లో విలన్లుగా, జోకర్లుగా చూపించే వారని.. ఇప్పుడు తెలంగాణ భాష మాట్లాడితేనే హీరో క్లిక్ అవుతున్నారని కేసీఆర్ అన్నారు. నీళ్లు తెచ్చుకున్నామని.. గోెదావరి జలాలను నిజాం సాగర్ వరకు తెచ్చుకున్నామని.. వడ్లను పండిస్తే కేంద్రం కూడా కొనలేని పరిస్థితికి వచ్చిందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version