వేలాది ఆర్టీసీ కార్మికులు భ‌విష్య‌త్తుపై.. నేడు సీఎం కేసీఆర్ నిర్ణయం..

-

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఫలితంగా సంస్థ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిందని, నష్టాన్ని భర్తీ చేయాలంటే ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాదు.. 5100 రూట్లను ప్రైవేటుపరం చేస్తున్నారు ప్రకటించారు. అయితే నేడు, రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీపై కీలక నిర్ణయాలు తీసుకోన్నట్లు సమాచారం. ఆర్టీసీ ప్రధాన అంశమే అజెండాగా జరగనున్న ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు దూకుడుగా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. సగం ఆర్టీసీని ప్రైవేటుకు అప్పగిస్తే సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సంగతి ఏంటి? వాళ్ల పరిస్థితి ఏంటి? ఉపాధి ఏంటి? అన్నవే ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్నలు.

మ‌రి ఈ రోజు ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీఆర్‌ఎస్‌ను దాదాపు 20 వేల మంది కార్మికులకు ఆఫర్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీలో 50 శాతం ప్రైవేటు చేతికి అందిస్తే సంస్థకు సగం మంది కార్మికులు మాత్రమే అవసరం అవుతారు. ప్రస్తుతం రాష్ట్రంలో 48 వేల మంది కార్మికులు ఉన్నారు. అందులో 24 వేల మంది మాత్రమే కావాల్సిన నేపథ్యంలో సీఆరెస్‌ (కంపల్సరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌) కూడా ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే సీఆర్‌ఎస్‌ అమలు చేస్తే, కార్మికులకు డబ్బులు కూడా బాగా ఇవ్వాల్సిఉంటుంది. ఇన్ని సమస్యల మధ్య ముఖ్యమంత్రి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news