ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారిన సరే తెలంగాణ సిఎం కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీనితో రాజకీయంగా సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇప్పుడు ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా ప్రజల్లోకి రాకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు. అయినా సరే సీఎం కేసీఆర్ మాత్రం రావడం లేదు. మంత్రి హరీష్ రావు కి బాధ్యతలు అప్పగించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు నలుగురు మంత్రులు బాధ్యతలు చూస్తున్నారు. కేటీఆర్ కూడా హైదరాబాదులో కాస్త గట్టిగానే కష్టపడుతున్నారు.
సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి ప్రచారం చేస్తే మంచి ఫలితాలుంటాయి. సీఎం కేసీఆర్ మాత్రం ఎప్పుడూ ఆసక్తి చూపించడం లేదు. ఉప ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం చేయలేదు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా సీఎం కేసీఆర్ ప్రచారం చేయడానికి ఇష్టపడలేదు. దీనితో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. మరి ఇప్పటికైనా సరే సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారా లేదా అనేది చూడాలి.