కాంగ్రెస్ ఇవాళ ‘చలో రాజ్ భవన్’ .. హైదరాబాద్ లో హై టెన్షన్ !

కాంగ్రెస్‌ పార్టీ ఇవాళ ‘చలో రాజ్ భవన్’ కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. అసాధారణంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ చలో రాజ్ భవన్ కు పిలుపు ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్‌. అయితే…. కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చిన… చలో రాజ్ భవన్ పై హైదరాబాద్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది.  ఇందిరాపార్క్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది.

అయితే…కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చిన.. రాజ్ భవన్ ర్యాలీకి హైదరాబాద్‌ పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి అనుమతిని ఇవ్వలేదు. కోవిడ్ నిబంధనలు పాటించి 200 మందితో ఇందిరాపార్క్ వద్ద సమావేశానికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు.

అనుమతి ఇవ్వకపోయినా చలో రాజ్ భవన్ నిర్వ హించి తీరుతామంటున్నారు కాంగ్రెస్ నేతలు. పోలీసులు అడ్డుకుంటే పోలీస్ స్టేషన్ లు కూడా ముట్టడి చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఇక అటు ఈ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు అలెర్ట్‌ అయ్యారు.