తెలంగాణలో కోరలు చాస్తోన్న కరోనా.. భారీగా కేసులు నమోదు..

తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణలో వరుసగా రెండో రోజు 400కిపైగా కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 494 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 28,865 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 494 మందికి పాజిటివ్ గా తేలింది.

New variant of Corona detected in India

హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 315 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 102, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 31 కేసులు గుర్తించారు. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 126 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.