తెలంగాణ లో 2కోట్లు దాటిన వ్యాక్సినేషన్..!

-

తెలంగాణ రాష్ట్రం లో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రం లో 18 ఏళ్లు పైబడిన 2.80 కోట్ల మందికి వ్యాక్సిన్ లు వేశారు. అంతే కాకుండా ఇప్పటివరకు 1.45 కోట్ల మందికి ఒక డోస్ వ్యాక్సిన్ ను వేశారు. అంతే కాకుండా 55లక్షల మంది రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకోగా ఒక్క డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకోని వారు దాదాపు 80 లక్షల మంది ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తుంది.

రానున్న రెండు వారాల్లో మరో కోటి మందికి కూడా వ్యాక్సిన్ లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. గ్రామాలు పట్టణాలు అని తేడా లేకుండా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ లను నిర్వహించి వ్యాక్సిన్ లను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో చిన్నా పెద్దా అందరికీ వ్యాక్సిన్ అందనుంది. ఇక ఇప్పటికే చాలా వరకు ప్రజలు వ్యాక్సిన్ లు తీసుకున్నారు కాబట్టి వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద కూడా రద్దీ తక్కువగా ఉండే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news